Dogs Attack On Man: రెచ్చిపోయిన కుక్కలు.. వ్యక్తిపై దాడి.. పరిస్థితి విషమం - మనిషిపై కుక్కల దాడి
🎬 Watch Now: Feature Video
Dogs Attack : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో కుక్కలు రెచ్చిపోయాయి. నిమ్మతొర్లాడు గ్రామానికి చెందిన గుణుపూర్ సూర్యనారాయణపై నాగావళి నది ఒడ్డున కుక్కలు గుంపుగా వచ్చి దాడి చేశాయి. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సూర్యనారాయణకు శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సూర్యనారాయణ ఎండ తీవ్రంగా ఉండడంతో నాగావళి నదిలో ఉన్న రచ్చబండ చెట్ల కింద సేద తీరేందుకు వెళుతుండగా ఒక్కసారి కుక్కలు దాడి చేయడంతో అక్కడే పడిపోయాడు. సమీపంలో ఉన్నవారు పరిగెత్తుకొచ్చి కుక్కల బారి నుంచి రక్షించారు. గాయపడిన వ్యక్తిని 108 సహాయంతో శ్రీకాకుళం సరోజన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విశాఖపట్నం కేజిహెచ్ తరలించాలని వైద్య అధికారులు సూచించినట్లు బాధితుని భార్య కమలమ్మ తెలిపారు. కుక్కలు తీవ్రంగా ఉన్నాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చికెన్, మటన్ దుకాణాలు అధికంగా ఉండడంతో ఈ ప్రాంతానికి కుక్కలు గుంపులు గుంపులుగా వస్తున్నాయని.. వాపోతున్నారు. తక్షమే అధికారులు స్పందించి కుక్కలు బెడదను తప్పించాలని కోరుతున్నారు.