Dog Attacked Several People in Kurnool District: కర్నూలు జిల్లాలో పిచ్చి కుక్క స్వైరవిహారం.. 10 మందిపై దాడి - Dog attack in Kurnool district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 8:08 PM IST
Dog Attacked Several People in Kurnool District: కుక్క చాలామంది పెంచుకునే జంతువు.. నిత్యం మన మధ్యే తిరిగే ప్రాణి. కానీ ఇప్పుడు కుక్కలంటేనే తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడుతున్న పరిస్థితి. కుక్కలు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తున్నాయి. ఏదో ఒకచోట జనంపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడి చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరినీ వెంటాడుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో 10 మందిపై దాడికి పాల్పడ్డాయి. దీంతో మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని ఆదోని పట్టణం విక్టోరియా పేటలో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. రోడ్డుపై తిరుగుతున్న 10 మందిపై పిచ్చి కుక్కదాడి చేసింది. పిచ్చి కుక్క దాడితో స్థానికులు ఒక్క సారిగా భయభ్రాంతులకు గురైయ్యారు. పిచ్చి కుక్క దాడిలో తీవ్ర గాయాలు పాలైన వారిని చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రిలో భాదితులను చేర్పించారు. పిచ్చికుక్కను స్థానికులు చంపేశారు.