Doctors advice on conjunctivitis Cases: రోజురోజుకూ పెరుగుతున్న కళ్ల కలక కేసులు.. సొంత వైద్యం వద్దంటున్న నిపుణులు!
🎬 Watch Now: Feature Video
conjunctivitis cases in Visakhapatnam : కొద్ది రోజులుగా కళ్ల కలక కేసులు పెరుగుతున్నాయి. కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు అధిక ముప్పు పొంచి ఉంది. ఎండాకాలం ముగిసి వర్షాకాలం వచ్చిన తరుణంలో పలు ప్రాంతాల్లో కళ్లకలక వ్యాప్తి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. వారం, పదిరోజులుగా కొంత తగ్గుదల కనిపించినా.. గతంలో కంటే వేగంగా విస్తరించడం ఈ వైరస్ సంతరించుకున్న కొత్త గుణంగా వైద్యులు చెబుతున్నారు. విశాఖలోని శంకర్ ఫౌండేషన్ నేత్ర నిపుణులు డాక్టర్ తస్రీన్ మాట్లాడుతూ.. సాధారణంగా మూడు నుంచి ఐదు రోజుల్లో సాధారణ స్థితికి వచ్చే ప్రభావం ఈ వైరస్‌కు ఉందని.. సొంత వైద్యం వద్దని చెబుతున్నారు. మెడికల్ దుకాణాల్లోని స్టెరాయిడ్స్ వాడితే.. కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఉత్తమమైన మార్గంగా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం మేలన్నారు. మూడు నుంచి ఐదు రోజుల్లో కండ్ల కలక ప్రభావం తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలన్నారు. కళ్లకలక ఎక్కువగా ఉండడంతో గత మూడు వారాలుగా కంటి శస్త్రచికిత్సలు తాత్కాలికంగా వాయిదా వేసి.. ఈ వారమే కొద్ది సంఖ్యలో మెుదలు పెట్టామన్నారు.