DL Ravindra Reddy on TDP-JanaSena Alliance: తెలుగుదేశం-జనసేన కూటమి 160 సీట్లు సాధించటం ఖాయం: డీఎల్ రవీంద్రారెడ్డి - DL Ravindra Reddy news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 7:44 PM IST
DL Ravindra Reddy on TDP-JanaSena Alliance: తెలుగుదేశం-జనసేన పార్టీల పొత్తుపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమి 160 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. ఈ కూటమి ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లోకి బలంగా వెళ్లిందని ఆయన గుర్తు చేశారు. కక్షసాధింపు రాజకీయాలతో రెచ్చిపోతున్న వైఎస్ జగన్ రెడ్డి.. నిజాయతీపరుడైన చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేయించడం దారుణమని మండిపపడ్డారు. బాబాయ్ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన జగన్.. సాక్ష్యాన్ని వెనక్కి తీసుకోమంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లంపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
DL Ravindra Reddy Comments: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ..''మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అజయ్ కల్లం సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చి.. మాట మార్చడంపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఐఏఎస్‌గా పనిచేసిన అజయ్.. సీబీఐకి 161-స్టేట్మెంట్ ఇచ్చి, ఇప్పుడు జగన్ రెడ్డి ఒత్తిడితో అలా చెప్పలేదని మాట మార్చడం సమంజసం కాదు. కచ్చితంగా ఈ కేసు జగన్ రెడ్డికి, ఆయన భార్య భారతి రెడ్డి మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి జగన్ మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి సాగనంపకపోతే భావి భారత పౌరులకు భవిష్యత్తు ఉండదు. జనసేన-టీడీపీల పొత్తు ఫలితంగా 2024 ఎన్నికల్లో 160 సీట్లు సాధించడం ఖాయం.'' అని ఆయన అన్నారు.