అధికారుల నిర్లక్ష్యంతో నిలిచిన తాగునీటి సరఫరా - స్థానికులతో కలిసి మేయర్ భర్త నిరసన - నిరసనకు దిగిన నెల్లూరు జిల్లా వాసులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 3:29 PM IST
Disruption of Drinking Water Supply : మిగ్జాం తుపాను తాకిడికి తాగునీరు అందక నెల్లూరు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు కార్పోరేషన్ మేయర్ స్రవంతి ప్రాతినిధ్యం వహించే 12వ వార్డు వావిలేటిపాడులో కరెంటు సమస్య కారణంగా నీటి కొలాయిలకు సరఫరా నిలిచిపోయింది. రెండు రోజులు నుంచి నీటి సరఫరా లేకపోవడం వల్ల స్థానికులు మేయర్ భర్త అయినా జయవర్ధన్కు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందించిన మొదటి రోజు నీరు అందించడం సాధ్యం కాలేదు. రెండో రోజు కూడా అదే పరిస్థితి ఏర్పడం వల్ల వార్డు ప్రజలు మేయర్ భర్తను నిలదీశారు. దీంతో ఆయన కార్పోరేషన్ అధికారులతో మాట్లాడి సంబంధిత వార్డుకు ఉదయమే నీళ్లు ట్యాంకర్ పంపించమని కోరారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సాయంత్రం అయినా నీళ్లు ట్యాంకర్ను పంపించలేదు. దీంతో ఆయన గ్రామస్థులతో కలిసి స్థానిక సచివాలయం వద్ద నిరసన తెలిపారు. ఒక్క వాటర్ ట్యాంకర్ను పంపించడానికి కార్పోరేషన్ అధికారులకు ఎందుకు అంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు.