భ్రమరాంబ మల్లేశ్వర దేవస్థానంలో భక్తులు, ఆలయ సిబ్బంది మధ్య ఘర్షణ - guntur social news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 9:07 PM IST

Dispute Between Devotees and Malleswara Temple Staff in Pedakakani : గుంటూరు జిల్లా పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వర దేవస్థానంలో భక్తులు, సిబ్బందికి మధ్య వివాదం చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన భక్తులు అన్నప్రాసన నిమిత్తం వచ్చి బయటకు వెళ్లే సమయంలో ఈ పరిస్థితి నెలకొంది. భక్తులు, వాచ్​మెన్​కి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వారిని అడ్డుకోవడానికి స్థానికులు ప్రయత్నించారు. అయినా ఘర్షణ కొనసాగడం వల్ల అక్కడ ఉన్నవారు పోలీస్​ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Police Actions : సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ నెలకొన్న పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన సిబ్బందిని స్థానికులు ప్రభుత్వ ఆస్పుత్రికి తరలించారు. బయటకు వెళ్లిన వాహనాలు లోపలికి రాకూడదని చెప్పడం వల్ల గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు వచ్చి అదుపు చేసే వరకు ఆలయ ప్రాంగణమంతా గందోరగోళ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. అసలు భక్తులకు, సిబ్బందికి మధ్య గొడవ జరగడానికి కారణాలను పోలీసులు స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.