Differences Among YSRCP leaders అక్కడికి పాకిన పోస్టర్ల పోరు.. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ వైసీపీలో వర్గపోరు - Differences among YSRCP leaders
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2023/640-480-18889335-792-18889335-1688204778151.jpg)
Differences Among YCP leaders in Vizianagaram district ఇటీవల నేతలపై అసంతృప్తిని పోస్టర్లతో వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా అధికార పార్టీలో ఈ తతంగం ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. సచివాలయం సారథుల కన్వీనర్ మార్పుపై వివాదం తలెత్తింది. ఎస్.కోట మండలం వసి గ్రామానికి చెందిన జెసీఎస్ కన్వీనరు వెంకట్రావు స్థానంలో వేరొక వ్యక్తిని నిమించడంపై.. వెంకట్రావు వర్గం భగ్గుమంది. దీంతో వెంకట్రావుకు మద్దతుగా.. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. జగనన్న ముద్దు - కడుబండి వద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ ఇంటింటికీ పోస్టర్లు అంటించారు. ఎంతో కాలంగా పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారిని ఎమ్మెల్యే పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని వెంకట్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదం విషయంలో పార్టీ పెద్దలు కలుగజేసుకోవాలని అంటున్నారు. తమకు న్యాయం చేయాలని.. జేసీఎస్ కన్వీనర్‌గా మళ్లీ తనను నియమించాలని వెంకట్రావు పార్టీ పెద్దలను కోరుతున్నారు.