రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గింది- డీజీపీ రాజేంద్రనాథరెడ్డి - DGP Rajendranathreddy Comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 11:07 AM IST
DGP Rajendranathreddy Comments on State Crime: రాష్ట్రంలో తీవ్రమైన నేరాల సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనాలను సోమవారం ఆయన ప్రారంభించారు. పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుందని అన్నారు. మహిళలపై జరిగే నేరాలను దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా అదుపు చేయగలుగుతున్నామన్నారు.
DGP Comments SI Promotions : 2023లో జరిగిన నేరాలపై సమీక్షించి త్వరలోనే మీడియాకు తెలియజేస్తామని రాజేంద్రనాథ రెడ్డి అన్నారు. త్వరలోనే ఎస్ఐలకు పదోన్నతలు ఇస్తామని, 100 పోలీస్ స్టేషన్‌లకు అప్‌గ్రేడ్ చేసి సీఐలను నియమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎస్సై పరీక్ష తుది ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తామని డీజీపీ తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని కూడా పెంచేందుకు ప్రతిపాదించామని అన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ప్రజలతో మమేకమై సేవలు అందించాలని పోలీసు సిబ్బందికి సూచించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారుఈ కార్యక్రమంలో కర్నూల్ డీజీపీ సెంథిల్ కుమార్, కలెక్టర్ గిరీష, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.