pratidwani: సీఐడీని ఏ ఉద్ధేశంతో ఏర్పాటు చేశారు ఇప్పుడదేం చేస్తోంది - ఆంధ్రప్రదేశ్లో సీఐడీ తీరుపై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
ఊ.. అంటే కేసు, ఆ అంటే కేసు.. ఆ పై అర్థరాత్రి అరెస్టులు. చివరాఖరుకు న్యాయస్థానాల్లో అక్షింతలు. కొంతకాలంగా రాష్ట్రంలో సీఐడీ అరెస్టులు, ఆ కేంద్రంగా నెలకొంటున్న పరిణామాలు ఇవే. తెల్లవారు జామున 3గంటల వేళ గోడదూకి, గేటు విరగొట్టి, చేపట్టిన అయ్యన్న అరెస్టే మొదటిదో, చివరిదో కాదు. సీనియర్ జర్నలిస్టులు, విశ్రాంత అధికారులు, ప్రజా ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు.. ఇలా అనేకమంది బాధితులు.. ఈ అరెస్టుల పరంపరలో. నిబంధనలు పాటించలేదని.., కస్టడీలో హింసించారన్న విమర్శలు, ఆరోపణలూ.. అనేకం. అసలు.. రాష్ట్రంలో సీఐడీ తీరు ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతోంది? తీవ్రమైన కేసుల చిక్కుముడి విడదీసే రాష్ట్ర తలమానిక దర్యాప్తు సంస్థగా ఉండాల్సిన సీఐడీ.. చిన్నచిన్న కారణాలతో ఎందుకు వార్తల్లో నిలుస్తోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST