Danda Nagendra Kumar Interview: తప్పుడు కేసులతో వేధిస్తున్నారు.. అయినా భయపడను: దండా నాగేంద్ర - Interview with Danda Nagendra
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 5:15 PM IST
Danda Nagendra Kumar Interview: ఇసుక తవ్వకాలు ఆపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని పిటిషనర్ దండా నాగేంద్ర ఆరోపించారు. పోలీసులు పెట్టిన అక్రమ మద్యం తరలింపు కేసులో అరెస్టై.. బెయిల్పై బయటకు వచ్చిన దండా నాగేంద్ర.. పరిమితికి మించి ఇసుకను డంపింగ్ యార్డుల్లో నిల్వచేసి ఉంచటాన్ని తప్పుబట్టారు. ఇసుక ద్వారా ప్రభుత్వ పెద్దలకు వస్తున్న ఆదాయం పడిపోవటంతో.. తనపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని.. అయినా భయపడేది లేదని స్పష్టం చేశారు.
గతంలో తాను కూడా ఇసుక రవాణాలో ఉన్నప్పటికీ.. నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు చేస్తున్న తీరుపైనే ఎన్జీటీని ఆశ్రయించాని అన్నారు. నదుల మధ్యలో భారీ రోడ్లు వేసి తవ్వకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంతా దీనిపై పోరాడాల్సిన అవసరం ఉందని దండా నాగేంద్ర అంటున్నారు. ఇంత అడ్డగోలుగా తవ్వకాలు జరిగితే భవిష్యత్తులో నదులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటోన్న నాగేంద్రతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.