ఎస్సీ, ఎస్టీ, బీసీల గొంతు కోస్తూ బస్సు యాత్ర పేరుతో వైసీపీ డ్రామాలు - దళిత, ప్రజా సంఘాల ఐకాస - Dalit Community leaders Fires on YCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 8:06 PM IST
Dalit Communities Fires on YCP Bus Yatra: సామాజిక న్యాయం పేరుతో వైసీపీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర.. ఓ బోగస్ యాత్ర అంటూ దళిత, ప్రజా సంఘాల ఐక్య కార్యచరణ సమితి నాయకులు ఆరోపించారు. ఓ పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీల గొంతు కోస్తూ.. సామాజిక న్యాయం పేరిట ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకే.. ఈ దౌర్భాగ్య యాత్రకు సీఎం జగన్ ప్రణాళిక రచించారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను జగన్ ప్రభుత్వం ఏ విధంగా ఛిద్రం చేసిందో ప్రజలకు తెలియజేసేలా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలపై వైసీపీ అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని.. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సామాజిక న్యాయ పోరాట సమితి అధ్యక్షుడు పేరూరి మురళికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నత పదవులు అన్నీ సీఎం జగన్ సమాజిక వర్గానికి చెందినవే ఉన్నాయని సమతా సైనిక్‌దళ్ అధ్యక్షుడు పాలేటి ఉమామహేశ్వరరావు అన్నారు. ఎస్సీల కోసం దశాబ్దాలుగా ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు.