Daggubati Purandeshwari Response on Party Alliance: పొత్తులపై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు... అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం: పురందేశ్వరి - Daggubati Purandeshwari comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2023, 7:58 PM IST

Daggubati Purandeshwari Response on Party Alliance: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు గురించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేస్తోన్న ప్రకటనలపై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. పార్టీల పొత్తులపై పవన్ కల్యాణ్ చేస్తోన్న ప్రకటనలు, అతడి అభిప్రాయాలను తమ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆమె అన్నారు. ఆ తర్వాత అధిష్ఠానం సూచనలు, నిర్ణయాల ప్రకారం వ్యవహరిస్తామన్నారు. పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న ప్రతి ప్రకటనలపై వెంటనే స్పందించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం తమకు లేదని పురందేశ్వరి తెలిపారు. ఏ పరిస్థితుల్లో జనసేన ఈ విధమైన నిర్ణయం తీసుకుందనేది పవన్ కల్యాణ్ తన ప్రసంగాల ద్వారా చెబుతూ వస్తున్నారన్న పురందేశ్వరి.. ఈ విషయాలన్నింటినీ తాము తమ అధిష్ఠానానికి తెలియజేస్తామన్నారు. 

BJP Core Committee Meeting: విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ..''గత నెల 17 నుంచి ఈనెల రెండో తేదీ వరకు చేపట్టిన సేవా పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించాం. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ఈ పక్షోత్సవాల్లో భాగంగా 95 రక్తదాన శిబిరాలు నిర్వహించి.. 2,960 యూనిట్ల రక్తం, 51 వైద్య శిబిరాలను నిర్వహించాం. 10,569 ఆయుష్మాన్‌భవ కార్డులను అందించాం. పార్టీ బలోపేతానికి రాష్ట్రంలోని 929 మండలాల్లో మూడేసి రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. మద్యంపై ఓ ఉద్యమాన్నే ప్రారంభించాం. మద్యం పేరుతో జరుగుతున్న దోపిడీపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.'' అని స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.