CWC Member Raghuveera Reddy on Bullock Cart: ఎడ్లబండిపై సవారి చేస్తూ దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్న కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి - dasara celebrations in sathya sai district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 9:13 PM IST
CWC Member Raghuveera Reddy on Bullock Cart: రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆటలు, పాటలు కేరింతలతో సందడి చేశారు. పలు పార్టీ నేతలు సైతం దసరా ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దసరా పండుగ వేడుకలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి చేసుకున్నారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి దసరా పండుగను గ్రామస్థులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. తన ఇంటి వద్ద నుంచి ఎడ్లబండిపై జంబు సవారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రఘువీరా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన ఎండ్లబండి వెనుకే తరలివచ్చారు. మేళ తాళాలు, గ్రామస్థులు కేరింతల నడుమ సవారి చేస్తూ ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం రఘువీరారెడ్డి అమ్మవారికి పూజలు నిర్వహించి.. జిమ్మి చెట్టుకు పూజలు చేసి విల్లు ఎక్కుపెట్టి బాణం ఆకాశంలో వదిలారు. దీంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.