ETV Bharat / state

అభిమానానికి పరవశం - భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ - NBK THANKS TO ALL WELL WISHERS

భారత ప్రభుత్వాని నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు -పద్మవిభూషణ్ అవార్డు రావడంతో తనకు అభినందనలు వారందరికి ఆయన ధన్యవాదములని పేర్కొన్నారు.

NBK Thanks To All Well Wishers
NBK Thanks To All Well Wishers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2025, 4:19 PM IST

NBK Thanks To All Fans And Well Wishers: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో నందమూరి బాలకృష్ణకు నన అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బాలకృష్ణకు పద్మవిభూషణ్ రావడంపై రాజకీయ, సినీ ప్రముఖులు నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి. తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా భారత ప్రభుత్వానికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ఆయన ధన్యవాదాలను తెలియజేశారు.

అందరికీ నా ధన్యవాదాలు:నందమూరి బాలకృష్ణ: తన ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారకరామారావు నుంచి ఆయన వారసుడిగా నేటి వరకు తన వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న తన అభిమానులకు, తనపై విశేష ఆదరాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానని బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా తన తోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ సైతం అభినందనలు చెప్పారు.

నిమ్మకూరులో బాలయ్య చిత్రపటానికి పాలాభిషేకం: బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో కృష్ణా జిల్లా నిమ్మకూరులో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాలకృష్ణ చిత్రపటానికి పామర్రు శాసనసభ్యులు వర్ర కుమార్‌ రాజా పాలాభిషేకం చేశారు. గ్రామస్తులు మిఠాయిలు పంచుకున్నారు. బాలకృష్ణకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఈ గౌరవం దక్కడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. సినీ రాజకీయ రంగాల్లోనే కాకుండా క్యాన్సర్ హాస్పటల్ ద్వారా సేవలు అందిస్తున్న బాలకృష్ణకు అవార్డు రావడం ఎంతో అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.

హిందూపురంలో అభిమానుల సంబరాలు: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు వచ్చిన శుభ సందర్భంగా బాణసంచా పేల్చి మిఠాయిలను పంపిణీ చేశారు. అదే విధంగా ఐదు సింహాల కూడలిలో బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన శుభ సందర్భంలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ.. కత్తి పడతారు, కదం తొక్కుతారు, తొడ కొడతారు, వెండి తెరపై శత్రువుల్ని తొక్కిపడేస్తారు. ఆయన ఏ డైలాగ్ చెప్పినా స్టెప్పులేసినా ప్రత్యేకమే. నటుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గానికి సేవలందిస్తున్నారు.తన తండ్రి స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆసుపత్రిలో అందుతున్న సేవలను పర్యవేక్షిస్తూ ఎంతోమందికి ఉచిత వైద్యం అందేలా కృషి చేస్తున్నారని ప్రజలందరూ అభిప్రాయపడ్డారు.

నెల్లూరులో బాలకృష్ణ అభిమానుల సంబరాలు: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ వరించడంతో నెల్లూరులో ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని నర్తకి సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం నేతలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినీ రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకుని ఎన్నో విజయాలతో ముందుకు వెళుతున్న బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం ఎంతో సంతోషకరమని ఈ సందర్భంగా తెలుగుదేశం నేత కోటంరెడ్డి సంధ్య అన్నారు. ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేస్తున్న బాలకృష్ణ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆమె కోరారు.

బాలకృష్ణకు పద్మభూషణ్​ - సీఎం చంద్రబాబు అభినందనలు

'మీ సేవకు ఇది నిదర్శనం బాబాయ్'- బాలయ్యకు NTR స్పెషల్ విషెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.