Customs Officials Search in Vijayawada: విజయవాడలో కస్టమ్స్ అధికారుల సోదాలు.. భారీగా బంగారం.. విదేశీ కరెన్సీ లభ్యం - విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న బస్సులో నగదు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2023, 12:05 PM IST
Customs Officials Search in Vijayawada: విజయవాడ కస్టమ్స్ అధికారులు పలు చోట్ల సోదాలు నిర్వహించగా.. వారికి రెండు చోట్ల భారీగా విదేశీ నగదు, బంగారం లభ్యమయ్యాయి. సుమారు 55 లక్షల విలువైన బంగారాన్ని.. మరో 16 లక్షల 63వేల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 55 లక్షల విలువైన బంగారం.. 3లక్షల 53 వేల రూపాయల విదేశీ కరెన్సీని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న బస్సులో నుంచి 13లక్షల 10వేల రూపాయల విదేశీ కరెన్సీని.. కాజా టోల్‌గేట్ వద్ద అధికారులు పట్టుకున్నారు. గత రెండేళ్లలో విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ ఆధ్వర్యంలో.. 40 కోట్ల రూపాయలు విలువచేసే 70 కిలోలకు పైగా బంగారాన్ని జప్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా నాగాయలంక తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఆర్ఐ పట్టుబడ్డారు. మండలంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కోసం కార్యాలయానికి రాగా.. అతడి నుంచి ఆర్ఐ 4,500 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పక్క ప్రణాళికతో ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.