Crocodile: పాడుబడ్డ బావిలో మొసలి హల్చల్.. చివరికి ఏమైందంటే! - Crocodile Halchal in Nandyala district
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18299927-39-18299927-1681975831559.jpg)
ఎండ తీవ్రత పెరిగే కొద్ది.. జీవరాశులు కూడా తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో ఒక మొసలి గ్రామంలోకి రావడం కలకలం రెేపింది. సాధారణంగా.. మొసళ్లు సముద్రాలు, నదులు, చెరువుల్లో సంచరిస్తూ ఉంటాయి. కానీ ఓ పెద్ద మొసలి ఏకంగా గ్రామంలోకి వచ్చేసింది. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలంలో గని గ్రామ సమీపంలో పాడుబడ్డ బావిలో మొసలి హల్చల్ చేసింది. పెద్ద పెద్ద శబ్ధాలు రావడంతో బావిలో మొసలి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఆ మొసలిని చూసి గ్రామస్థులు బెదిరిపోయారు. భారీ సైజులో ఉన్న మొసలిని చూసి ఆందోళన చెందారు. వెంటనే విషయాన్ని స్థానిక అటవీశాఖ అధికారులకు చేరవేయడంతో.. అటవి శాఖ అధికారులు వచ్చి తాళ్లతో ముసలిని బంధించి తీసుకెళ్లారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. బావిలో మొసలి ఉన్నట్లు సమాచారం తెలియడంతో చుట్టు పక్కల వారు పెద్ద సంఖ్యలో బావి వద్దకు వచ్చి చూశారు. మొసలి ఇక్కడికి ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అనే విషయాలపై చర్చించుకుంటున్నారు.