CM Jagan: మొత్తం కలిపి 30 కి.మీ లేదు.. హెలికాప్టర్ ఎందుకు సీఎం సారు..! - Cm Jagan Tour
🎬 Watch Now: Feature Video
CM Jagan Helicopter Journey: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు అత్యుత్సాహన్ని ప్రదర్శిస్తోంది. పట్టుమని పది కిలోమీటర్ల దూరం లేని కార్యక్రమానికి కూడా.. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా వెళ్లనున్నారు. పదుల కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వినియోగించటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వందల కిలోమీటర్ల దూరం అంటే ఏమే కానీ, ఇలా పదుల కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.
అమరావతిలో పేదలకు అందించిన సెంటు స్థలాలలో ఇళ్ల నిర్మాణానికి ఈ నెల 24న.. ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతుండగా.. అందులో భాగంగా అధికారులు రెండు హెలిపాడ్లను సిద్ధం చేశారు. ఒకటి కృష్ణయ్యపాలెంలో మరొకటి వెంకటపాలెంలో నిర్మిస్తున్నారు. కృష్ణయ్యపాలెంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. తాడేపల్లి నుంచి ఇక్కడికి కేవలం 8కిలోమీటర్ల దూరమే ప్రయాణం. భూమి పూజ కార్యక్రమనంతరం.. వెంకటపాలెం బహిరంగ సభకు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. వెంకటపాలెంకు, కృష్ణయ్యపాలెం మధ్య సీఎం జగన్ ప్రయాణించాల్సింది కేవలం 6కిలోమీటర్ల దూరం మాత్రమే.. అక్కడ బహిరంగ సభ ముగించుకున్న తర్వాత సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఉండే తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకోనున్నారు. దాదాపు అంతా కలిపితే 30 కిలోమీటర్లు కూడా రానీ.. ఈ ప్రయాణానికి ముఖ్యమంత్రి హెలికాప్టర్ వాడటం.. దానికి హెలిప్యాడ్లు సిద్ధం చేయటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి