CRDA Cities Project: అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు నేడు ప్రారంభం.. ఆరు నెలల్లో పూర్తి చేయాలని సీఆర్డీఏ నిర్ణయం - అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు నేడు ప్రారంభం
🎬 Watch Now: Feature Video
AP CRDA Cities Project Start in Capital Amaravati : రాజధాని అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు పనులను మొదలు పెట్టనున్నట్లు సీఆర్డీఏ తెలిపింది. రాజధాని అమరావతి ప్రాంతంలోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, బేతపూడి ప్రాంతాల్లో ఏపీ సీఆర్డీఏ, ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో సిటీస్ ప్రాజెక్టు పనులకు ఈ నెల 28వ తేదీన శ్రీకారం చుట్టనున్నట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సిటీస్ ప్రాజెక్టులో భాగంగా పాఠశాలల భవనాలు, ఈ హెల్త్ సెంటరు భవనాల నిర్మాణ పనులు నేడు ప్రారంభం కానున్నాయి. 7.74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఏపీ సీఆర్డీఏ తెలిపింది. ఈ నిధులతో ప్రతి గ్రామానికి ఒక పాఠశాల, ఈ హెల్త్ సెంటరు సమకూరుతాయని, నిర్మాణ పనులను ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు.