CPM Fire on YSRCP Govt about Irrigation ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప.. రైతుల సమస్యలు పట్టవు: సీపీఎం శ్రీనివాసరావు - Problems of farmers in AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 23, 2023, 8:15 PM IST
CPM Fire on YSRCP Govt about Irrigation రాష్ట్రంలో సాగునీటి కొరత తీవ్రంగా ఉందని తెలిసినా రాష్ట్రప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేయకపోవటం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆక్షేపించారు. ఈ ప్రభుత్వానికి రాజకీయ ఆరోపణలు మినహా మరేమీ పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వెంటనే కరవు మండలాల్లో ఉన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతకు ముందు వర్షాలు పడకపోతే సాధారణంగా కరవు పరిస్థితులు వచ్చేవి.. కాని ఇప్పుడు కృష్ణా, గోదావరికి కూడా అలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పడికే చాలా వరకు పంటలు ఎండిపోయాయి.. ఇప్పుడు కనుక నీళ్లు ఇవ్వకపోతే ఉన్న పంటలు కూడా ఎండిపోతాయని అన్నరు. రాయలసీమలో అయితే పూర్తిగా పంటలు ఎండిపోయాయని అన్నారు.. గోదావరి నుంచి నీళ్లు ఇస్తే కృష్ణాలో నీళ్లు ఉంటాయని అన్నారు. ప్రభుత్వం పట్టిసీమ నుంచి నీళ్లు ఇస్తామన్నారు.. కాని వారు ఇవ్వకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదని అన్నారు.