'డిమాండ్లు పరిష్కరించటం ఇష్టంలేక ప్రభుత్వం అబద్దాలు చెబుతోంది' - CPM Senior Leader Madhu

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 12:23 PM IST

CPM Senior Leader Madhu Support Anganwadi Municipal Workers: ప్రభుత్వం వద్ద డబ్బు లేదనటం అవాస్తవమని, మద్యం సీసాల్లో, ఇసుక, సలహాదారుల వద్ద అసలు ఖజానా ఉందని సీపీఎం సీనియర్‌ నేత మధు (CPM Leader Madhu) ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వేతనాలు పెంచాలంటూ ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులకు, అంగన్వాడీ కార్యకర్తలకు గురువారం మధు సంఘీభావం తెలిపారు. వీరికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని కార్మికులకు మధు సూచించారు.

CPM Leader Fires on YSRCP Government: కార్మికుల న్యాయ సమ్మతమైన కోరికలను ఎగ్గొట్టడానికే ప్రభుత్వం వద్ద డబ్బు లేదని చెబుతోందని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారే కానీ అదనపు హామీలు అడగటంలేదని మధు అన్నారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడతామని మధు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.