CPM Praja Rakshana Bheri Bus Yatra Started: కరవు, వలసల నివారణలో వైసీపీ ప్రభుత్వం విఫలం: సీపీఎం - సీపీఎం బస్సు యాత్ర ప్రారంభోత్సవం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 30, 2023, 9:49 PM IST
CPM Praja Rakshana Bheri Bus Yatra Started From Adoni : కర్నూలు జిల్లా ఆదోనిలో సీపీఎం ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే హాజరై బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. బీజేపీ ప్రభుత్వం దేశంలో చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. అసమానతలు లేని అభివృద్ధి కోసం సీపీఎం ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర చేపట్టిందని తెలిపారు. కర్నూలు జిల్లాలో కరవు, వలసలు నివారించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయింది అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాయలసీమ ఎడారిగా మారుతుందని ఎద్దేవా చేశారు.
CPM Praja Rakshana Bheri Bus Yatra In AP: రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, నిధులు, అభివృద్ధిని విడిచి... పురోగతిలేని లేని పాలన చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గఫూర్ విమర్శించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. 26 జిల్లాల బస్సు యాత్ర పూర్తయిన తరువాత నవంబర్ 15న విజవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.