CPM Announced Praja Rakshana Bheri: బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోంది.. నవంబర్ 15న 'ప్రజా రక్షణ భేరి' సభ : సీపీఎం - CPM Srinivasa Rao Comments on Pawan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 25, 2023, 7:30 PM IST
CPM State Secretary Srinivasa Rao Announced Praja Rakshana Bheri Details: రాబోయే ఎన్నికల్లో సీపీఎం పార్టీ అనుసరించనున్న రాజకీయ విధానాన్ని.. నవంబర్ 15వ తేదీన ప్రకటించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఇదే రోజు విజయవాడలో ప్రజా రక్షణ భేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సభ నిర్వహణకు స్థానిక సింగ్నగర్లో మాకినేని బసవపున్నయ్య స్టేడియం ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.
బీజేపీతో పొత్తు కలిసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు ఆరాటపడుతున్నాయని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకా ఎన్డీఏలోనే ఉన్నానని చెబుతున్నారన్నారు. బీజేపీ ఇచ్చిన రోడ్డు మ్యాప్తోనే పవన్ టీడీపీతో కలిశారా అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గతంలో మద్యం అమ్మకాల వివరాలను ప్రభుత్వాన్ని కోరారని.. కానీ, నేడు ఎందుకు మద్యం అమ్మకాలపై మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని.. రాష్ట్ర హక్కుల సాధన కోసం అన్ని పార్టీలు పోరాటం చేయాలని పేర్కొన్నారు.