TIDCO Houses: టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలి: రామకృష్ణ - Titco Homes News
🎬 Watch Now: Feature Video

CPI Ramakrishna For TIDCO houses: టిడ్కో గృహాలకు కనీస వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కర్నూలులో అన్నారు. కర్నూలు జిల్లాలో 18 వేల 800 గృహాలు పూర్తి అయినా లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తి అయిన గృహాలను లబ్ధిదారులకు అందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజనకు రామకృష్ణ వినతి పత్రం అందించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగనన్న కాలనీలో ఇండ్లు నిర్మించుకునేందుకు ఒక లక్ష 80 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ఇందులో కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేల రూపాయాలు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30 వేల రూపాయలు ఇస్తుందని ఆయన అన్నారు. గృహాలు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇసుక, సిమెంటు ఉచితంగా ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలులోని జర్నలిస్టు కాలనీలో మట్టి మాఫియా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కలెక్టర్ సృజనను ఆయన కోరారు.