CPI Ramakrishna రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి.. అమర్‌నాథ్ కుటుంబాన్ని పరామర్శించిన రామకృష్ణ.. - Ramakrishna visited Amarnath family members
🎬 Watch Now: Feature Video
CPI Ramakrishna visited Amarnath family: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెంలో అమర్నాథ్ కుటుంబ సభ్యులను రామకృష్ణ పరామర్శించారు. అన్యంపుణ్యం ఎరుగని బాలుడిని హత్య చేయడం దారుణమని.. ఈ ఘటనను అందరూ ఖండిచాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. అమర్నాథ్ హత్య కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమర్నాథ్ కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయల సాయం ప్రకటించాలని.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన మరవకముందే బాలుడి అమర్నాథ్ హత్యోదంతం రాష్ట్రంలోని శాంతి భద్రతలకు అద్దం పడుతోందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నేరాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. అంతే కాకుండా రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో చట్టం ఉందా, పోలీసులు ఉన్నారా అనే అనుమానం కలుగుతోందని రామకృష్ణ ప్రశ్నించారు.