CPI Ramakrishna Response on Margadarsi: మార్గదర్శి వ్యవహారంలో హైకోర్టు స్టే ప్రభుత్వానికి చెంపపెట్టు: రామకృష్ణ
🎬 Watch Now: Feature Video
CPI Ramakrishna Response on Margadarsi: మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో మరోమారు రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. మార్గదర్శి చిట్ గ్రూప్‌ల నిలిపివేతపై అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసును హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి వ్యవహారంలో హైకోర్టు స్టే ఇవ్వడమనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రిక, టీవీలో వార్తలు వేస్తున్నారని.. వాటిని దృష్టిలో పెట్టుకొని మార్గదర్శిపై దాడులు చేస్తూ, వారికి నోటీసులు ఇస్తూ.. సంస్థ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదన్నారు. పదే పదే కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. వారికి బహిరంగ నోటీసులు ఇచ్చి చందాదారులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. నిజంగా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు ఆపాలని ఆయన సూచించారు. ఇటువంటి చర్యలు మంచిది కాదని.. చట్ట ప్రకారం ప్రభుత్వం పరిపాలన చేయాలని పేర్కొన్నారు.