CPI Ramakrishna on Jagan మేము కాదు.. జగనే అదానీకి అమ్ముడుపోయాడు: సీపీఐ రామకృష్ణ - CPI leader Ramakrishna Reacted to Alliance

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 8:21 PM IST

CPI leader Ramakrishna Allegations on Jagan:  ఆదానితో రెండు గంటలపాటు రహస్య సమావేశం గుట్టు విప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ భూములను దక్కించుకోవడానికి జగన్ ఆదానితో సమావేశమయ్యారని రామకృష్ణ ఆరోపించారు. వామపక్షాలు అమ్ముడుపోయాయన్న ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై రామకృష్ణ మండిపడ్డారు. అమ్ముడుపోయింది కమ్యూనిస్ట్​లు కాదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే.. ఆదానికి అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అదానికి దోచి పెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 4ఏళ్ళు గడిచినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టలేదన్నారు.  కేంద్రంలో మోదీ, ఏపీలో జగన్  ప్రభుత్వాలను సాగనంపడమే తమ విధానమని  అన్నారు. తమతో కలిసి వచ్చేవారితో పొత్తులు పెట్టుకుంటామని చెప్పారు. మోదీ, జగన్‌లు.. దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 

సీఎం జగన్ దోపిడీ, అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని.. తెలంగాణ కంటే ఏపీ ఎంతో వెనుకబడి పోయిందంటూ  రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ రివర్స్ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అన్ని రంగాలను అంధకారంలోకి నెట్టారని దుయ్యబట్టారు. ఐటీ అనేది ఏపీలో లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో  పోలీసులను అడ్డం పెట్టి.. అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ  కాబట్టి... వాళ్లతో కలిసి పని చేసే ఆలోచన చేస్తున్నట్లు  రామకృష్ణ తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.