CPI Ramakrishna criticises government మూడు నెలల్లో 35వేల కోట్ల అప్పు తెచ్చిన ఘనత జగన్​దే : సీపీఐ నేత రామకృష్ణ - విడయవాడ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2023, 8:23 PM IST

CPI Ramakrishna criticises government : సీఎం జగన్ ప్రభుత్వాన్ని రివర్స్ గేర్​లో నడిపిస్తూ.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడ దాసరి భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు తీసుకువచ్చి కనీసం ఇప్పడు వడ్డీ కూడా కట్టలేని స్థితికి తీసుకొచ్చారన్నారు. మూడు నెలల వ్యవధిలోనే రూ.35వేల కోట్లు అప్పు తెచ్చిన ఘనత జగన్​కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని చేయకుండా.. ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికొదిలేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. పారిశ్రామిక రంగం కుదేలైపోయింది. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి అన్నారు. అభివృద్ధిపై ప్రశ్నించే ప్రతిపక్షాల పార్టీలను అణచివేసేందుకే పోలీస్ రాజ్యాన్ని నడుపుతున్నారు అని అన్నారు. ఆగస్టు 17న విశాఖపట్నం నుంచి రాష్టాన్ని కాపాడండి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో బస్సు యాత్ర చేపడుతున్నామని అన్నారు. జగన్​ అరాచక పాలనను ఎండగట్టేందుకే విశాఖ నుంచి తిరుపతి వరకు బస్సు యాత్రను చేపట్టబోతున్నామని వెల్లడించారు. అనంతరం యాత్రకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.