CPI Ramakrishna comments on AP debts: రాష్ట్ర అప్పులపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది: రామకృష్ణ
🎬 Watch Now: Feature Video
CPI Ramakrishna comments on AP debts: రాష్ట్ర అప్పులపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇటీవల రాష్ట్ర అప్పులు ఎంత ఉన్నాయనే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రెస్మీట్లో వివరించారు. అయితే ఆ లెక్కలకు.. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తున్న లెక్కలకు కొంచెం కూడా పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అప్పులు పెరగలేదని ఆర్ధిక మంత్రి అంటున్నారు.. కాని దానికి సంబంధించిన వివరాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నామని అన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రాష్ట్ర అప్పులు, విభజన చట్టంలో హామీల అమలు ఎంతవరకు సాధించారు.. ఇంకా ఏమి సాధించాలి.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిచ్చింది.. ఇంకే ఏమి ఇవ్వాలి అనే అంశాలపై చర్చించాలని రామకృష్ణ అన్నారు.