No permission for Chalo Vidyut Soudha : ఈ నెల 17 విద్యుత్ సౌధ ముట్టడికి ఉద్యోగుల పిలుపు.. అనుమతి లేదంటున్న సీపీ - no permission for Chalo Vidyut Soudha
🎬 Watch Now: Feature Video
CP clarified there is no permission for Chalo Vidyut Soudha : విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 17న చేపట్టిన విద్యుత్ సౌధ ముట్టడికి అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతి రాణా తెలిపారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇంజినీర్ల సంఘం సంయుక్తంగా ఈ నెల 17 న ఛలో విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, విజయవాడ సీపీ కాంతి రాణా ఈ ముట్టడికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఎవరూ కూడా రావద్దని సూచించారు. కాదని ఎవరైనా పాల్గొంటే 'ఎస్మా' చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలానే వారిపై కేసుల నమోదు చేస్తామని చెప్పారు. విద్యుత్ సౌధ, ఆయా ప్రాంతాల్లో సుమారు రెండు వందల సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని వెల్లడించారు. సంఘ నేతలకు ముందుస్తుగా నోటీసులు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమానికి మూడు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.