Contractor Questioned MLA: పెండింగ్ బిల్లులపై గుత్తేదారు ప్రశ్నలు.. మౌనం వహించిన ఎమ్మెల్యే - ఏలూరి గోపాల్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-07-2023/640-480-19090133-1058-19090133-1690269247367.jpg)
Contractor Questioned MLA in Gadapa Gadapa: 'గ్రామ సచివాలయ నిర్మాణానికి బిల్లును చెల్లించకుండా ఎలా ప్రారంభిస్తారు' అంటూ స్థానిక ఎమ్మెల్యేని గుత్తేదారు నిలదీసిన ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని కంబాలదిన్నె గ్రామ సచివాలయాన్ని అక్కంపేట గ్రామానికి చెందిన ఏలూరి గోపాల్ రెడ్డి అనే గుత్తేదారుడు.. వైఎస్సార్సీపీ నాయకుల మాయమాటలు నమ్మి వడ్డీకి తెచ్చి సచివాలయ భవన నిర్మాణ పనులను పూర్తి చేశాడు. గడప గడప కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్.. కంబాలదిన్నె గ్రామపంచాయతీలో పర్యటించాడు. అప్పు చేసి సచివాలయాన్ని నిర్మించిన గుత్తేదారుడికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హడావిడిగా నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న గుత్తేదారుడు గోపాల్ రెడ్డి మరుసటి రోజు రేణిమడుగు గ్రామానికి వెళ్లాడు. అక్కడ గడపగడప కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్‌ను అడ్డుకొన్నాడు. పార్టీని నమ్ముకొని అప్పులు చేసి సచివాలయ భవనాన్ని నిర్మించానని.. కనీసం ప్రారంభ సమయంలోనైనా సమాచారం ఇవ్వకుండానే ఎలా ప్రారంభిస్తారు అంటూ ఎమ్మెల్యేని నిలదీశాడు. దీంతో గుత్తేదారుడికి తిరుగు సమాధానం చెప్పలేక స్థానిక ఎమ్మెల్యే మౌనంగా ఉండిపోయాడు.