విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఖరారైన మహూర్తం
🎬 Watch Now: Feature Video
CM YS Jagan will Inaugurates 125 feet Ambedkar Statue: సమాజంలో ఉన్న వివక్షలు తొలగించేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేసిన కృషి మరవలేనిదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. అంబేడ్కర్ దార్శనికుడు, ధీశాలి అని కొనియాడారు. ఈ నెల 19న విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రారంభిస్తున్న 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహ ఏర్పాట్లను పార్టీ నేతలతో వెళ్లి పరిశీలించారు. మొత్తం లక్షా 20 వేల మంది సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు.
4 వందల కోట్ల రూపాయలతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి చరిత్రలో నిలిచిపోయో కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మిగిలిన వర్గాలతో పాటు ఎస్సీలు సమానంగా అభివృద్ధి చెందేలా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చూశారని, ప్రస్తుతం అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయంటే ఆ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
అంటరానితనం నిర్మూలనకు అంబేడ్కర్ చేసిన కృషి అందరికీ స్ఫూర్తి దాయకమన్న సాయిరెడ్డి, విజయవాడలో నిర్మించిన భారీ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. భావితరాలన్నీ అంబేడ్కర్ ఆశయాలు నెరవేర్చే లక్ష్యం, స్ఫూర్తి కోసం విగ్రహావిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంగణం పర్యాటక కేంద్రంగా రూపొందుతుందన్నారు.