రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై అసత్య ప్రచారం: సీఎం కార్యదర్శి దువ్వూరి కృష్ణ
🎬 Watch Now: Feature Video
CM Secretary Explanation on the Government Debt : రాష్ట్ర అప్పులపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం జరుగుతోందని సీఎం కార్యదర్శి దువ్వూరి కృష్ణ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో పెరిగిన అప్పుల నిష్పత్తితో పోలిస్తే ప్రస్తుతం తగ్గిందని ఆయన వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయని తెలిపారు. కేంద్రం అనుమతి లేకుండా, పరిధికి మించి అప్పులు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై అసత్యాలు ప్రచారం చేయడం తగదని ఆయన మండిపడ్డారు.
ఆర్‌బీఐ నివేదిక ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ అప్పులు రూ. 1,18,050 కోట్లు కాగా, టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.2.71 లక్షల కోట్లకి అప్పు చేరిందన్నారు. టీడీపీ హయాంలో ప్రతీ ఏటా 20 శాతం అప్పు పెరగగా, ప్రస్తుత ప్రభుత్వంలో ఏటా పెరిగిన అప్పు 15.42 శాతం మాత్రమేనని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎంబీ నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ లెక్కలన్నీ కాగ్, ఆర్‌బీఐ ధృవీకరించినవే అన్నారు. విద్యుత్ డిస్కంల అప్పు విభజనకి ముందు రూ.2893 కోట్లు అయితే టీడీపీ హయాంలో రూ.21,541కోట్లకు పెరిగిందని తెలిపారు.
TAGGED:
దువ్వూరి కృష్ణ ఆరోపణలు