జనవరి 19న విజయవాడలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ - కలెక్టర్ల వీడియో కాన్పరెన్స్‌లో సీఎం జగన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 9:22 PM IST
CM Jagan Video Conference With Collectors: జనవరి 1 నుంచి వైఎస్సార్ పింఛన్ కానుకను 3 వేల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, అంబేడ్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాల నిర్వహణలో ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుందన్నారు.
జనవరి 19న విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్సార్ ఆసరా కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి 14వరకు వైఎస్సార్ చేయూత కార్యక్రమం కొనసాగుతుందని, ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహిస్తుందని అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 15, 16వ తేదీలలో ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తామని, వాటితోపాటు లబ్ధిదారులపై రూపొందించిన వాటిలో ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు ఇస్తామన్నారు. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైఎస్సార్ చేయూత కార్యక్రమం జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు.