CM Jagan Return to AP From London Visit: లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న జగన్.. - Jagan trip to London cost
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2023, 10:28 AM IST
CM Jagan Return to AP From London Visit: ఈ నెల 2న లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సీఎం జగన్ దంపతులు.. పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్కు విమానాశ్రయంలో మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, నాగేశ్వరరావు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. అలానే సీఎం జగన్ బుధవారం దిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం విజ్ఞప్తి చేసింది. బుధవారం లేకుంటే.. ఈ వారంలోనే జగన్ దిల్లీ వెళ్లి ప్రధానిని కలిసే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత పర్యటన కోసం లండన్ వెళ్లిన సీఎం జగన్.. ఈ ఉదయం విజయవాడ వచ్చారు. 13న దిల్లీ, 14న నిడదవోలు, 15న విజయనగరం పర్యటనలపై ఈ సాయంత్రం స్పష్టత రానుంది.