CM Jagan Released the Funds: అర్హత ఉండి పథకాలు దక్కని వారికి నిధులు విడుదల.. బటన్ నొక్కిన సీఎం జగన్
🎬 Watch Now: Feature Video
CM Jagan Released the Funds: అర్హత ఉండి సంక్షేమ పథకాలు వర్తించని లబ్ధిదారులకు సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి డబ్బులు జమ చేశారు. డిసెంబర్ 2022 నుంచి జూలై 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి.. వివిధ కారణాలతో లబ్ధి కలగని 2 లక్షల 62 వేల169 మంది అర్హులకు 216.34 కోట్ల రూపాయలు.. సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. అర్హత ఉండి ఏ కారణంతోనైనా పథకం అందనివారికి మరో అవకాశం ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. కొత్తగా పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్ కార్డులు, స్థలాలు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా.. ప్రతి ఇంటిని జల్లెడపట్టి అవసరమైన వారికి 94 లక్షల 62 వేల 184 ధ్రువపత్రాల జారీతో పాటు.. కొత్తగా మరో 12 వేల 405 మంది లబ్ధిదారులను గుర్తించి.. నేడు వారికి ప్రయోజనం అందించినట్లు తెలిపారు.