జగనన్న విదేశీ విద్యాదీవెన - సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలు విడుదల

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 3:51 PM IST

CM Jagan Released Jagananna Videshi Vidya Deevena Scheme Funds:  రాష్ట్రంలోని పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్ గా ఎదగాలని సీఎం జగన్ సూచించారు. రాష్ట్రానికి ఏదో ఒకరోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఆశయమని జగన్ వెల్లడించారు. పిల్లల ఉన్నతి కి సంబంధించిన స్టోరీలు స్పూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్య కోసం పేదలు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో విదేశీ విద్యా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జగన్ తెలిపారు. 

జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను సీఎం జగన్ విడుదల చేశారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లు విడుదల చేశారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించిన 95 మందికి ప్రోత్సాహకం విడుదల చేశారు. వీరిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా 1.5 కోట్లు విడుదల చేశారు. మొత్తం 42.60 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.