CM Jagan Presented Silkclothes to Kanakadurgamma: విజయవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ - Vijayawada Indrakiladri updates
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 20, 2023, 7:41 PM IST
|Updated : Oct 20, 2023, 8:04 PM IST
CM Jagan Presented Silkclothes to Kanakadurga Ammavaru: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Vijayawada Indrakiladri Celebrations Updates: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల (అక్టోబరు) 15వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలా త్రిపుర సుందరీదేవిగా, గాయత్రిదేవిగా, అన్నపూర్ణాదేవిగా, మహాలక్ష్మీదేవిగా, మహాచండీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు.. శుక్రవారం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో అభయమిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఇదే రోజున ప్రభుత్వం తరపున సీఎం పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం ఆనవాయితీగా వస్తోంది. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన సీఎం జగన్‌కు.. దుర్గగుడి ఈవో, ఛైర్మన్, మంత్రి కొట్టు సత్యనారాయణలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత సీఎంకు అర్చకులు.. తీర్థ ప్రసాదాలు ఇచ్చి వేద ఆశీర్వాదం అందించారు.