'బ్యాట్ ఇలా పట్టాలి, సిక్స్ అలా కొట్టాలి' - రోజాకు సీఎం జగన్ బ్యాటింగ్ మెళకువలు - ఏపీ ఆడుదాం ఆంధ్రా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-12-2023/640-480-20359245-thumbnail-16x9--jagan-batting.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 4:22 PM IST
|Updated : Dec 26, 2023, 5:28 PM IST
CM Jagan Played Cricket at Adudam Andhra Programme: 'ఆడుదాం ఆంధ్రా' దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని, ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గుంటూరులోని నల్లపాడుల లయోలా పబ్లిక్ స్కూల్‌లో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఉత్సాహంగా కనిపించారు. సీఎం దగ్గరుండి మరీ మంత్రి రోజాకు క్రికెట్ ఎలా ఆడాలో నేర్పించే ప్రయత్నం చేశారు. సీఎం జగన్ సూచనలతో రోజా బ్యాటింగ్ చేసింది. బంతిని బౌండరీ వైపు వెళ్లేలా కొట్టింది. అనంతరం శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బౌలింగ్ చేయగా, సీఎం జగన్ బ్యాటింగ్ చేశారు. రోజా కీపింగ్ చేస్తూ సీఎం జగన్‌ను ఉత్సాహపరిచింది. మరో మంత్రి విడదల రజిని సీఎం బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తూ క్లాప్స్ కొట్టింది. మంత్రులు ఉత్సాహంగా ఫీల్డింగ్ చేస్తూ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో ఉత్సాహంగా కనిపించారు. సీఎం జగన్ మంత్రి రోజాకు బ్యాటింగ్ ఎలా ఆడాలో సూచనలిస్తూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 10 వరకు 47 రోజులపాటు పోటీలు జరుగుతాయని తెలిపారు. క్రీడలు, వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో ఆవశ్యకమని తెలియజేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అదేవిధంగా మట్టిలో మాణిక్యాలను వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆడుదాం ఆంధ్రాలో సింధు, శ్రీకాంత్ భాగస్వాములవుతున్నారని తెలిపారు. ఇకపై ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.