TDP MLC Ashok Babu: జగన్ పిల్లలకు మేనమామ కాదు.. దొంగ మామ: ఎమ్మెల్సీ అశోక్‌బాబు - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
TDP MLC Ashok Babu Fires on CM: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని చూసి సీఎం భయపడుతున్నారని.. అది జగన్ మొహం చూస్తేనే అర్థం అవుతోందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్లి కూడా రాజకీయాలు మాట్లాడటం నీచమని ధ్వజమెత్తారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించమని హెచ్చరించారు. మీడియా ఛానెల్స్‌పై పదే పదే సీఎం మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబుని అసభ్య పదజాలంతో దూషిస్తే అంతకుమించి తాము కూడా మాట్లాడగలమన్నారు. బాబాయ్‌ని గొడ్డలి పోటు పొడిచి.. చంద్రబాబుని వెన్నుపోటు అంటే ఎవరు నమ్మరన్నారు. జగన్ పిల్లలకు మేనమామ కాదు.. దొంగ మామ అని దుయ్యబట్టారు. జగన్ చరిత్ర.. రక్త చరిత్ర అని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు ఏమి చేయలేకపోయారని.. ఇక ఈ ఏడాదిలో ఏమి చేయగలరని ప్రశ్నించారు. సీఎం జగన్.. భాష మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు.