Tirumala News: ఆగస్టు 1 నుంచి నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత
🎬 Watch Now: Feature Video
Closure of Srivari Pushkarini: తిరుమలలో శ్రీవారి పుష్కరిణిని నెల రోజుల పాటు మూసి వేస్తున్నట్లు తితిదే అధికారులు ప్రకటించారు. ఆగస్టు నెల మొత్తం శ్రీవారి పుష్కరిణి మూసి వేయనున్నారు. దీంతో నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని అన్నారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల ముందు పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, ఇతర చిన్న చిన్న పనులు చేపడతారు. ఈ కారణంగా ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు స్వామి వారి పుష్కరిణిలో భక్తులకు అనుమతి ఉండదు. పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు అందులోని నీటిని తొలగిస్తారు. ఆ తరువాత పది రోజులు మరమ్మతులను పూర్తి చేస్తారు. చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి సిద్ధం చేస్తారు. అనంతరం పుష్కరిణిలోకి భక్తులను తితిదే అనుమతించనుంది.