వైసీపీ వర్గాల్లో ఇసుక వాటాల చిచ్చు-కారు దగ్ధం! కేసు నమోదు చేసేందుకు వెనకడుగు వేస్తున్న పోలీసులు - ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 18, 2023, 3:20 PM IST
Clashes Between YSRCP Groups in Sending Sand : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో ఇసుక తరలింపు వివాదం అధికార పార్టీ వర్గ విభేదాలను రచ్చకీడ్చింది. ఉప్పలపాడు ఇసుక రీచ్ (Sand Rich) నుంచి ఇసుక తరలింపు విషయంలో వైసీపీ మండల కన్వీనర్ నారాయణ రెడ్డికి మరో వర్గానికి వివాదం తలెత్తింది. డబ్బు పంపకాల్లో విభేదాలు రావడంతో పరస్పరం రాళ్ల అనంతపురం వద్ద జాతీయ రహదారిపైనే దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నారాయణరెడ్డికి చెందిన ఇన్నోవా వాహనంపై దాడి చేసి నిప్పుపెట్టాడు. దీంతో వాహనం దగ్ధం అయిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Illegal Sand Mining in Andhra Pradesh : నిందితులు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ముఖ్య అనుచరులే కావడంతో పోలీసులపై కేసు నమోదు కాకుండా ఒత్తిడి తీసుకొస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా శనివారం కూడా పోలీసులు అటువైపు వెళ్ళలేదు. తమకు ఫిర్యాదు అందలేదంటూ ముదిగుబ్బ పోలీసులు దాటవేస్తున్నారు. కొంతకాలంగా ఇసుక రీచ్ వద్ద ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారని.. డబ్బు వివాదం దాడికి దారి తీసిందని స్థానికులు తెలిపారు.