Clashes in Two Families ఇరుకుటుంబాల పాత గొడవలు.. కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు
🎬 Watch Now: Feature Video
Clashes Between Two Families in Thurlapadu: ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో.. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరుకుటుంబాల మధ్య.. పాత ఘర్షణల కారణంగా.. ఒకరిపై ఒకరు కర్రలు, గొడ్డలి తో దాడి చేసుకున్నారు. ఇరువర్గాల వారు కర్రలతో, గొడ్డలి తో దాడి చేసుకోవడంతో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ గొడవతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలు గొడ్డలితో దాడి చేసుకోవడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారం అంతా ప్రత్యక్షంగా చూసిన గ్రామస్థులు ఎవరికి ఏం జరుగుతుందో అని భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్రగాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.