Clash Between YSRCP activists: పెనుగొండలో స్థల వివాదం.. వైసీపీ శ్రేణుల ఇరువర్గాల ఘర్షణ - ap political news
🎬 Watch Now: Feature Video

Clash Between Two groups in YSRCP at Penukonda: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఇంటి స్థలం విషయంలో వైఎస్సార్సీపీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. పెనుగొండ నగర పంచాయతీ రెండో వార్డ్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఇంటి స్థలం విషయంలో వైసీపీకి చెందిన వెంకటేష్.. వెంకటగిరి పాళ్యం గ్రామానికి చెందిన చిరంజీవికి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం ఉదయం వెంకటేష్ పునాది నిర్మాణ పనులు చేపట్టడంతో చిరంజీవి, అతని బంధువులు 9 మంది... వెంకటేష్పై కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ.. విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. వెంకటేష్ ఇద్దరు తమ్ముళ్ల గోవిందు, ఆదిమూర్తులు, అతని భార్య దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాడిని నిలువరించలేకపోవడంతో వారికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఇంటి స్థలం విషయంలో వైఎస్సార్సీపీ వర్గీయులే గొడవపడడంపై స్థానికులు పెదవిరుస్తున్నారు.