Clash Between Two Groups in Vinayaka Immersion: వినాయక నిమజ్జనంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. దాడి చేసిన వారికే పోలీసులు సహకరిస్తున్నారని బాధితుల ఆందోళన - ap news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 10:48 AM IST
Clash Between Two Groups in Vinayaka Immersion in Dachepalle : పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన వినాయక ఊరేగింపులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన రెండు వర్గాల వారు నిన్న రాత్రి ఊరేగింపుగా వెళ్తుండగా ఒకరికి ఒకరు ఎదురు పడ్డారు. ఆ సమయంలో వారి మధ్య మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఓ వర్గం వారు మరో వర్గం వారిపై దాడి చేశారు. కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. పలువురికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనంతరం పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసుల లాఠీ ఛార్జ్‌లో మరి కొందరు గాయపడ్డారు. దాడి చేసిన వర్గానికి పోలీసులు సహకరిస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. అద్దంకి - నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై బైఠాయించారు. టైర్లకు నిప్పుపెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.