సర్దార్ పాపన్న విగ్రహం ఏర్పాటు - గౌడ సామాజిక వర్గీయులకు, పోలీసుల మధ్య వాగ్వాదం
🎬 Watch Now: Feature Video
Clash Between the Police and Gowda Sub Caste in Tadiparru : తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్ పాపన్న విగ్రహం ఏర్పాటు విషయంలో గౌడ సామాజిక వర్గీయులకు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గతంలో గ్రామస్థులకు, గౌడ సామాజిక వర్గీయులకు వివాదం తలెత్తడంతో విగ్రహం ఏర్పాటు నిలిచిపోయింది. తాజాగా విగ్రహం ఏర్పాటు చేయగా అనుమతులు లేవని పోలీసులు తొలగించే ప్రయత్నం చేశారు. విగ్రహాన్ని తొలగిస్తే తాము ఆత్మహత్య చేసుకోవడానికి అయినా సిద్ధమంటూ గౌడ సామాజిక వర్గీయలు ఆందోళనకు దిగారు.
Sardar Papanna Statue Set Up Issue in East Godavari District : ఈ ఆందోళనలో మహిళలు సైతం పాల్గొని.. విగ్రహాన్ని తొలగిస్తే తాము ఆత్మహత్య చేసుకోవడానికి అయినా సిద్ధమంటూ పెట్రోల్ సీసాలతో విగ్రహం వద్దే బైఠాయించారు. గ్రామంలో మిగిలిన విగ్రహాల అనుమతులు చూపించి తాము ఏర్పాటు చేసిన విగ్రహం తొలగించాలని స్పష్టం చేశారు. దీంతో చేసేది ఏమి లేక విగ్రహానికి ముసుగు కప్పి పోలీసులు వెనుదిరిగారు. విగ్రహానికి సంబంధించి గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.