కేసుల విషయంలో దాడి చేసుకున్న న్యాయవాదులు - కమీషన్లే కారణం! - పరస్పరం దాడి చేసుకున్న లాయర్లు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-11-2023/640-480-20083183-thumbnail-16x9-clash-between-lawyers-in-vuyyuru-court.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 12:03 PM IST
Clash Between Lawyers in Vuyyuru Court : కృష్ణా జిల్లా ఉయ్యూరు కోర్టులో న్యాయవాదులు ఘర్షణకు దిగారు. లాయర్లలోని ఇరు వర్గాలకు మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నాగరాజు అనే వ్యక్తి సుమారు దశాబ్ద కాలం నుంచి ఇక్కడి కోర్టులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన.. కేసుల అప్పగింతలో న్యాయవాదులు సుదర్శన రావు, ప్రతాప్‌తో పాటు మరికొందరికి సహకరిస్తూ కమీషన్ పొందుతున్నారని ఉయ్యూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగిత గోపీచంద్ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Lawyers attacking each other in Krishna District : దీంతో హోంగార్డు నాగరాజుని గన్నవరం కోర్టుకు బదిలీ చేశారు. ఈ విషయంలో గోపీచంద్‌కు సుదర్శనరావు, ప్రతాప్‌కు మధ్య కోర్టు ప్రాంగణంలో వాగ్వాదం ఏర్పడి ఒకరినొకరు నెట్టుకున్నారు. ఎస్సై అక్కడికి చేరుకునేలోపే గొడవ సద్దుమణిగింది.హోంగార్డుపై ఫిర్యాదు చేశాననే కోపంతోనే తనపై అతని అనుకూల లాయర్లు దాడి చేశారని చెప్పారు. అయితే ఈ ఘర్షణపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.