Drivers Protest: జగన్ హామీ ఇచ్చి మరిచారు.. 'క్లాప్' డ్రైవర్ల మెరుపు నిరసన - ఆంధ్రప్రదేశ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18274031-456-18274031-1681720010896.jpg)
Clap Vehicle Drivers Protest: సమస్యలు పరిష్కరించాలంటూ విశాఖ జీవీఎంసీ పరిధిలోని క్లాప్ (నగర, పురపాలక సంస్థల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన సమాంతర వ్యవస్థ క్లాప్) పథక వాహన డ్రైవర్లు నిరసనకు దిగారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేశారు. 8జోన్లు, 98 డివిజన్లలలో ఉన్న చెత్త సేకరణ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చెత్త సేకరణ చేసే క్లాప్ వాహనాలు షెడ్లకు పరిమితమైపోయాయి. విశాఖలో 4500 వాహనాలు నిలిచిపోయాయి. ముందు 18వేల 500 జీతం అని చెప్పి.. విధుల్లో చేరిన తర్వాత మాత్రం రూ.10 వేలు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాంధీ జయంతి రోజు మొదలుపెట్టిన ఈ పథకం రెండేళ్లు గడుస్తున్నా.. సీఎం జగన్ ఇచ్చిన మాట తప్పారని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఏపీ సీఓఎస్లో చేర్చకపోవడం, జీతాలలో కోతలు, అక్రమాలు, పీఎఫ్, ఈఎస్ఐ, డిమాండ్లతో నిరసన చేస్తున్నట్టు చెప్పారు. సమస్యల పరిష్కరించమని అధికారుల దగ్గరకు వెళ్తుంటే పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా అధికారులు బెదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని.. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు.