ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ప్రజల కోసం 'సిటిజెన్స్ ఫర్‌ డెమోక్రసీ సంస్థ సదస్సు' - Lakshman Reddy latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 10:53 AM IST

Citizens For Democracy Meeting On Vishaka: రాష్ట్రంలో ప్రజలపై కొనసాగుతున్న నిర్బంధకాండకు వ్యతిరేకంగా సిటిజెన్స్ ఫర్‌ డెమోక్రసీ సంస్థ సదస్సు(Citizens For Democracy organisation Meeting)ను ఈరోజు ఉదయం 11గంటలకు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని విశాఖలోని డాల్ఫిన్‌ హోటల్లో ఏర్పాట్లు చేసినట్లు సంస్ధ నిర్వాహకుడు లక్ష్మణ్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే గుంటూరు, విజయవాడలో నిర్వహించిన సదస్సులకు మంచి స్పందన లభించిందన్నారు.

Lakshman Reddy Organized Conference to support Uttarandhra and Godavari Districts: అలాగే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలబడేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని  లక్ష్మణ్‌ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, రాష్ట్ర ఎన్నికల విశ్రాంత కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, మాజీ డీజీపీ భాస్కర్‌రావు సహా పలువురు న్యాయ నిపుణులు కూడా ఈ సదస్సులో పాల్గొనున్నారని స్పష్టం చేశారు. అనంతరం బాధితుల సలహాలను నివృత్తం చేస్తారని లక్ష్మణ‌్‌ రెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.