CI and SI in ACB Trap 15వేలు ఇస్తే.. మరొకరిని ఇరికిస్తాం! లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై - పొందూరు మండలంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన సీఐ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 8, 2023, 1:26 PM IST

Updated : Jun 8, 2023, 3:19 PM IST

CI and SI caught by ACB: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సీఐ శ్రీనివాసరావు, ఎస్సై మురళి అవినీతి నిరోధక శాఖ అధికారులు పన్నిన వలలో చిక్కారు. మద్యం అక్రమ రవాణా కేసులో రూ.15,000 లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్​హ్యండెడ్​గా పట్టుబడ్డారు. 

డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జి.సిగడాం మండలం నిద్దంకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మే 25వ తేదీన 5 మద్యం సీసాలను తీసుకెళ్తుండగా పొందూరు సమీపంలో ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అయితే స్థానిక పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీనిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 15 వేల రూపాయలు లంచం ఇవ్వాలని సీఐ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. రూ. 15 వేలు ఇస్తే అతడికి బదులుగా మరో వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. అంత నగదు ఇవ్వలేని పరిస్థితుల్లో రూ. 5వేల రూపాయలు ఇచ్చి.. తన కేసును మరొకరిపై నమోదు చేసేందుకు అతడే మరో వ్యక్తిని తీసుకుని రావాలని నిందితుడితో సీఐ అన్నారు.

ఈ విధంగా నిందితుడు లంచం ఇస్తే.. అతడిని కేసు నుంచి తప్పిస్తామని ఆయన చెప్పారు. అయితే నిందితుడు నగదు ఇవ్వకపోవటంతో రోజూ అతడిని స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. దీంతో విసుగు చెందిన నిందితుడు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు నిందితుడు ఎస్​ఈబీ సీఐకీ ఫోన్​ చేసి అడిగిన నగదును ఇస్తానని చెప్పాడు. అయితే తాను విశాఖపట్నంలో ఉన్నానని డబ్బులను స్టేషన్​లో ఉన్న ఎస్​ఐకు ఇవ్వమని సీఐ చెప్పారు. దీంతో నిందితుడు పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఎస్​ఐ మురళికి రూ. 15 వేలు లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. విశాఖలో ఉన్న శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు పొందూరు తీసుకొచ్చారు. సీఐ,ఎస్ఐలను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. 

Last Updated : Jun 8, 2023, 3:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.