Chittoor SP Rishanth Reddy On Punganur Issue: 'పుంగనూరు ఘటనకు కారకులైన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు' - పుంగనూరు ఘటనపై చిత్తూరు ఎస్పీ స్పందన
🎬 Watch Now: Feature Video
Chittoor SP Rishanth Reddy On Punganur Issue: పుంగనూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుందని చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అన్నారు. పుంగనూరులో దాడి జరిగిన ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు. దాడికి సంబంధించిన అంశాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విధినిర్వహణలో ఉన్న పోలీసులపై టీడీపీ కార్యకర్తలు విచక్షణా రహితంగా రాళ్లు, కర్రలు, బీర్ బాటిళ్లతో దాడి చేశారని తెలిపారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై సుమారు గంటన్నర పాటు దాడి చేశారని.. పోలీసులు చాలా సంయమనం పాటించి సాధ్యమైనంత వరకూ నిలువరించేందుకు ప్రయత్నించారని వివరించారు. గుంపుగా వచ్చినవారు పోలీసుల వాహనాలు కూడా తగలపెట్టడం చాలా గర్హనీయమని ఎస్పీ అన్నారు. దాడిలో 63 మంది పోలీసులకు గాయాలు కాగా.. వారిలో 13 మంది తీవ్రంగా గాయపడినట్లు ఎస్పీ తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారి ఎంతటి వారి అయినా.. ఎంత పెద్ద వారు అయినా సరే వదిలిపెట్టేది లేదని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.